Header Banner

గత 3 ఏళ్లల్లో భారతీయులకు రూ.21 వేల కోట్లు చెల్లించిన యూట్యూబ్! టాప్ 100 యూట్యూబ్ ఛానళ్లల్లో..

  Sat May 03, 2025 20:58        Politics

కంటెంట్ క్రియేటర్లు, ఆర్టిస్టులు, మీడియా కంపెనీల అభివృద్ధి కోసం భారత్‌లో రూ.850 కోట్లు వెచ్చించనున్నట్టు సంస్థ సీఈసీ నీల్ మోహన్ గురువారం తెలిపారు. భారతీయుల కంటెంట్‌ను గతేడాది విదేశీయులు 45 బిలియన్ గంటల పాటు వీక్షించారని తెలిపారు. ఇక గత మూడేళ్లల్లో యూట్యూబ్ భారత కంటెంట్ క్రియేటర్లు, ఆర్టిస్టులు, మీడియా కంపెనీలకు రూ.21 వేల కోట్లు చెల్లించిందని కూడా తెలిపారు. భారత దేశ ప్రత్యేకతకు కంటెంట్ క్రియేటర్లు ఉదాహరణగా నిలుస్తున్నారని ఆయన అన్నారు. భారత దేశ చరిత్ర, సంస్కృతి వంటి అంశాలను ఎంతో అనురక్తితో ప్రపంచంతో పంచుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచవ్యాప్తంగా కంటెంట్ క్రియేటర్లకు మార్గదర్శిగా నిలుస్తోందని అన్నారు. ప్రపంచంలో అత్యధిక యూట్యూబ్ ఫాలోవర్లు ఉన్న ప్రభుత్వాధినేతగా ప్రధాని మోదీ అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నారని కూడా అన్నారు.

 

ఇది కూడా చదవండి: సంచలన నిర్ణయం తీసుకున్న OYO హోటల్స్.. మరో కొత్త కాన్సెప్ట్‌తో - ఇక వారికి పండగే..

 

భారత్‌ను క్రియేటర్ నేషన్‌గా ఆయన అభివర్ణించారు. భారత్‌లో దాదాపు 100 మిలియన్ ఛానల్స్ గతేడాది యూట్యూబ్ వీడియోలు అప్‌లోడ్ చేశాయని అన్నారు. వీటిల్లో సుమారు 15 వేల పైచిలుకు ఛానల్స్‌కు ఒక మిలియన్‌కు మించిన సబ్‌స్క్రైబర్లు ఉన్నారని తెలిపారు. ‘‘మిలియన్ మంది సబ్‌స్క్రైబర్లు ఉన్న ఛానల్స్ సంఖ్య కొద్ది నెలల క్రితం కేవలం 11 వేలుగా ఉండేది. ఇప్పుడు 15 వేలు దాటిపోయింది’’ అని చెప్పారు. యూట్యూబ్ సాయంతో వీరంతా తమ అభిరుచిని ప్రపంచంతో షేర్ చేయడంతో పాటు మంచి వ్యాపారాలను కూడా నిర్మించగలిగారని ఆయన తెలిపారు. ప్రపంచంలో ఎక్కడెక్కడి కంటెంట్ క్రియేటర్లు, వ్యూవర్స్‌ను కలిపే అద్భుత సామర్థ్యం యూట్యూబ్ సొంతమని తెలిపారు. సాంస్కృతిక విలువల ఎగుమతికి యూట్యూబ్ ఓ సృజనాత్మక సాధనమని అన్నారు. ఇక ప్రపంచంలోని టాప్ 100 యూట్యూబ్ ఛానళ్లల్లో అనేకం భారత్‌కు చెందినవే. టీసిరీస్, ఎస్ఈటీ ఇండియా, జీ మ్యూజిక్ కంపెనీ, సోనీ సాబ్ వంటివి నిత్యం ముందు వరుసలో నిలుస్తున్నాయి. టీసిరీస్‌కు 292 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. భారతీయ యూట్యూబ్ ఛానల్స్‌లో ప్రస్తుతం ఇదే టాప్.

 

ఇది కూడా చదవండి: పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు శుభవార్త.. నెలకు రూ.60 వేల జీతం.. దరఖాస్తుకు మే 13 చివరి తేదీ!

 

ఇక బతకలేను.. నా చావుకు కారణం వాళ్లే! ఢీ ఫేమ్ జాను కన్నీటి వీడియోతో కలకలం!

 

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.4 వేలు! ఈ పథకం గురించి తెలుసా, దరఖాస్తు చేస్కోండి!

 

కూటమి ప్రభుత్వ రాకతో అమరావతి బంగారు బాట! ఇకపై ప్రతి ఆంధ్రుడు..

 

షాకింగ్ న్యూస్.. తెలుగు యూట్యూబర్ అనుమానాస్పద మృతి.. అతనే కారణమా?

 

గుడ్ న్యూస్! ఏపీలోనూ మెట్రోకు గ్రీన్ సిగ్నల్! ఎక్కడంటే?

 

గన్నవరం ఎయిర్‌పోర్టులో మరోసారి కలకలం.. ఈసారి ఏం జరిగిందంటే!

 

ప్రయాణించేవారికి శుభవార్త.. అమరావతికి సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ.. సిద్ధమైన కృష్ణా నదిపై వారధి!

 

అకౌంట్లలో డబ్బు జమ.. 1 లక్ష రుణమాఫీ. ప్రభుత్వం ఆదేశాలు.! గైడ్‌లైన్స్ విడుదల!

 

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Modi #AndhraPradesh #delhi #Election2024 #APPolitics #india #JPNadda #BJPParty #BJPJPNadda